The Desk…Eluru : చెస్ ఛాంపియన్ గా చిన్నూ

The Desk…Eluru : చెస్ ఛాంపియన్ గా చిన్నూ

  • టెక్సాస్ స్టేట్ చెస్ ఛాంపియన్ గా ద్వితీయ స్థానం సాధించిన ఏలూరు వాసి తపన్ కుషల్(చిన్నూ!)

🔴 టెక్సాస్/ఏలూరు ;THE DESK NEWS :

అమెరికాలో అండర్ 800 కేటగిరి 2025 టెక్సాస్ స్టేట్ రీజియన్ చెస్ ఛాంపియన్ షిప్ కోసం ఈరోజున హోరా హోరీగా జరిగిన పోటీలో 5-4 తేడాతో ఏలూరు కు చెందిన తపన్ కుషల్(చిన్నూ)ద్వితీయ స్థానం సాధించారు.

2024 లో డల్లాస్ సిటీ స్థాయిలో జరిగిన చేస్ టోర్నమెంట్ లో ప్రధమ స్థానంలో నిలచి 2024 చెస్ ట్రోఫీ సాధించిన తసన్ కుషల్ ఇప్పటి వరకూ స్థానికంగా ఫ్రిస్కో,దల్లాస్ లో జరిగిన అనేక చెస్ పోటీలలో 4 సార్లు విజేతగా నిలిచారు. అయితే అతి పెద్ద రాష్ట్రమైన టెక్సాస్ లో జరిగిన రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ లో ద్వితీయ స్థానం సాధించటం విశేషం.

తపన్ కుషల్ ఏలూరుకు చెంది, అమెరికా పౌరసత్వం పొందిన గాయత్రీదేవి పులి,క్రాంతికుమార్ దంపతుల కుమారుడు మరియు ప్రముఖ సామాజికవేత్త పులి శ్రీరాములు మనవడు కావడం విశేషం. పలువురు సామాజిక మాధ్యమాల ద్వారా, చరవాణిల ద్వారా ఏలూరు నగరవాసులు, అభిమానులు పులి శ్రీరాములుకు అభినందనలు తెలియజేశారు.