The Desk…Eluru : ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

The Desk…Eluru : ఏలూరు ఎంపీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

స్థానిక శాంతినగర్ లోని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

కూటమి నాయకులు, కార్యాలయం సిబ్బందితో కలిసి జిల్లా పరిషత్ విశ్రాంత సీఈఓ చిరువోలులంక కుమారస్వామి జాతీయ జెండాను ఆవిష్కరించి అభివాదం చేశారు. జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించి దేశభక్తిని చాటి చెప్పారు. గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వక్తలు వివరించారు. కార్యక్రమంలో నాయకులు నందిగం సీతారాం తిలక్ (బాబి), కాట్రు బాలకృష్ణ ( బాలు), ఆలూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.