The Desk…Eluru : బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టిండి : ఎంపీ పుట్టా మహేష్

The Desk…Eluru : బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టిండి : ఎంపీ పుట్టా మహేష్

ఏలూరు జిల్లా : ఏలూరు : THE DESK NEWS :

లారీ యజమానుల బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు.

తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని శ్రీ ఆంజనేయ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియోషన్ ఆధ్వర్యంలో చింతలపూడికి చెందిన లారీ ఓనర్లు శనివారం ఏలూరు క్యాంప్ కార్యాలయంలో ఎంపీ మహేష్ కుమార్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.

సార్వాకు సంబంధించి 17478.04 మెట్రిక్ టన్నుల ధాన్యం తమ అసోసియోషన్ ద్వారా లారీలతో తరలించగా, రూ.1,18,97,070/ – లు రావలసియున్నదని ఎంపీ మహేష్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు. తమకు రావలసిన బాకాయిలను ఇప్పించాలని కోరారు. తక్షణం స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ విషయాన్ని ఫోన్ ద్వారా జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డికి వివరించారు.

లారీ యజమానుల బకాయిలు త్వరగా చెల్లించాలని జాయింట్ కలెక్టర్ కు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సూచించారు. ప్రభుత్వ నుంచి నిధులు విడుదల చేశారని, లారీ యజమానుల బకాయిల చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు తెలిపారు.