శ్రీకాకుళం జిల్లా : ఎచ్చెర్ల : THE DESK :
ఎచ్చెర్ల మండలం, చిలకపాలెం వద్ద గల ఎన్.ఎ.సి.ఎల్. ఫాక్టరీ సరైన కాలుష్య నియంత్రణ చేపట్టక పోవడం కారణంగా సమీప గ్రామాల ప్రజలు వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని, భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని గతంలో ఎన్ని సార్లు గ్రీవెన్స్ విభాగంలో ఫిర్యాదు చేసినా, ఫాక్టరీ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవడం లేదని, సమీప గ్రామం కేసవదాసుపురంకు చెందిన పొందూరు మండల బిజెపి ఉపాధ్యక్షుడు రాయి వెంకటరమణ, బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ విభాగం “వారధి” లో గత కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. “వారధి” విభాగం వారు, ఈ సమస్యపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ శాఖ వారికి లేఖను పంపారు.
బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యుడు చల్లా వెంకటేశ్వరరావు అధ్వర్యంలో బిజెపి నాయకులు శ్రీకాకుళం జిల్లా కలెక్టరును కలిసి, బిజెపి రాష్ట్ర గ్రీవెన్స్ విభాగం” వారధి” వారిచ్చిన లేఖను అందజేసి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈయనతో పాటు పొందూరు మండలం బిజెపి ఉపాధ్యక్షుడు రాయి వెంకటరమణ, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బైపల్లి రాజేశ్వరి, యువ మోర్చా నాయకుడు సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు