The Desk…Dwarakatirumala : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జేసీ ధాత్రిరెడ్డి క్షేత్రస్థాయి స్థల పరిశీలన

The Desk…Dwarakatirumala : సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు జేసీ ధాత్రిరెడ్డి క్షేత్రస్థాయి స్థల పరిశీలన

ఏలూరు జిల్లా : ద్వారకా తిరుమల : THE DESK :

ద్వారకా తిరుమల గ్రామములో మోడల్ సోలార్ విలేజ్ ను మొట్ట మొదటిగా ఆంధ్ర ప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణి సంస్థ వారి ఆద్వర్యములో పైలట్ సోలార్ ప్రాజెక్ట్ క్రింద 750 KWp సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుచేయుటకు అవసరమగు స్థలాన్ని మంగళవారం జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డిక్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు.

ఏ పి ఈ పి డి సి ఎల్ పర్యవేక్షక ఇంజనీర్ పి.సాల్మన్ రాజు , ఈఈ. ఆపరేషన్ కె.ఎం.అంబేద్కర్ ఇతర విద్యుత్ అధికారులు ఆమె వెంట వుండి సోలార్ ప్లాంట్ ఏర్పాటు వివరాలు తెలిపారు.అనంతరం విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్, పి.సాల్మన్ రాజు అధ్యక్షతన పి యం సూర్య ఘర్ యోజన పథకంపై గృహ విద్యుత్ వినియోగదారులకు అవగాహన సదస్సునునిర్వహించారు.

ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ.. ప్రతి గృహ వినియోగదారుడు ఈ పథకం ద్వారా ప్రభుత్వం వారు ఇచ్చే సబ్సిడీని వినియోగించుకుని సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని కరెంట్ బిల్లులను తగ్గించుకొనడమే కాకుండా ఉత్పత్తి అయిన విద్యుత్యూనిట్లను వాడుకోగా మిగిలిన విద్యుత్తును తిరిగి గవర్నమెంట్ వారికి విక్రయించడం ద్వారా ఆదాయమును పొందవచ్చునన్నారు.

సౌర శక్తిని వినియోగించి సోలార్ రూఫ్టాప్ ద్వారా భూమిపై కర్బన ఉద్గారాలను తగ్గించుకోవచ్చని.. తద్వారా పర్యావరణంను పరిరక్షించుకొనవచ్చునన్నారు. సోలార్ రూఫ్ టాప్ ప్యానల్స్ ఏర్పాటుకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీకే రుణ సదుపాయం పొందవచ్చునన్నారు.

కార్యక్రమంలో ఈ.ఈ.ఆపరేషన్ కె.ఎం. అంటేద్కర్ , ఈఈ కన్స్ట్రక్షన్ టీ. శశిధర్, డిప్యూటి ఈఈ, ఆపరేషన్ కె.గోపాలకృష్ణ , వివిధ సోలార్ వెండర్స్, వివిధ బ్యాంక్అధికారులు , ఇతర విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.