The Desk… Dwarakathirumala : ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల స్కామ్..!!

The Desk… Dwarakathirumala : ద్వారకాతిరుమల దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల స్కామ్..!!

🔴 ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల : ది డెస్క్ :

7గురు అరెస్టు – రిమాండ్..

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు..

డిఎస్పి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో..

భీమడోలు సిఐ పి కృష్ణ నేతృత్వంలో…

ద్వారకాతిరుమల ఎస్సై టి. సుధీర్ ఆధ్వర్యంలో..

ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల స్కామ్ సంచలనం సృష్టించింది. గురువారం ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి భీమడోలు న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ప్రధాన ముద్దాయి అయితoపూడి సాయి జగన్నాథ రాజు, ములగాల రమేష్, తొంటపాక సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీనివాసు, సెక్యూరిటీ గార్డ్ కీర్తి అశోక్ కుమార్, మాజీ సూపర్వైజర్ మానుకొండ ఆంజనేయులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావు అరెస్టు చేశారు.

గతంలో సముద్రాల శేషుబాబు, మేక సతీష్‌లను 200 రూపాయల నకిలీ టిక్కెట్ల కేసులో పట్టుకుని రిమాండ్ వేశారు.
భీమడోలు సిఐ పి కృష్ణ నేతృత్వంలో ద్వారకాతిరుమల ఎస్సై టి. సుధీర్ సాంకేతిక పరిజ్ఞానంతో రాజును పట్టుకున్నారు. ముద్దాయివద్ద డెల్ లాప్‌టాప్, టీవీఎస్ ధర్మల్ ప్రింటర్ స్వాధీనం. ఇంకా పాత్ర ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు డీఎస్‌పి శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. దర్యాప్తులో కానిస్టేబుల్స్ జి. ధర్మరాజు, టి. లక్ష్మీనారాయణ, హోంగార్డు వి.జె. ప్రకాష్ పాల్గొన్నారు.

Fake Ticket Racket Busted at Dwarakathirumala Temple

7 Arrested, Remanded..!!

In a major crackdown, police arrested seven individuals in a fake ticket scam at the revered Sri Venkateswara Swamy temple in Dwarakathirumala, creating a sensation. Acting on SP orders, under DSP Shravankumar’s supervision, Bhimadole CI Krishna led the team, with Dwarakathirumala SI T. Sudheer at the helm.

The prime accused, Ayitampoodi Sai Jaganath Raju, along with Mulagala Ramesh, Thontapaka Satyanarayana, Uppalapati Srinivasu, security guard Kirti Ashok Kumar, ex-supervisor Manukonda Anjaneyulu, and software engineer Muttyala Naga Venkata Satya Srinivas Rao, were produced in Bhimadole court and remanded. Earlier, Samudrala Seshubabu and Mek Satish faced similar action in a Rs 200 fake ticket case.

Using tech intel, police seized a Dell laptop and TVS thermal printer from Raju. DSP Shravankumar warned of stern action against others involved. The probe team included constables G. Dharmaraju, T. Lakshminarayana, and Home Guard V.J. Prakash.