🔴 ఏలూరు జిల్లా : ద్వారకాతిరుమల : ది డెస్క్ :

శనివారం ఉదయం జంగారెడ్డిగూడెం పర్యటనకు వెళుతూ మార్గమధ్యలో ద్వారకా తిరుమల వచ్చిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు యాదవ సంఘం తరపున ఆత్మీయ సత్కారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ… ద్వారకా తిరుమలలోని కళ్యాణ మండపం ఆధునీకరణ పనులకు 1 కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ఎప్పుడైనా తమ ఆఫీసుకి రావొచ్చని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. పేద కుటుంబాలలో వివాహ శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం ఏర్పాటు చేసిన స్థానిక నేతలకు ఎంపీ అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకూ ఏ ఎంపీ కూడా చేయని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న పుట్టా మహేష్ కుమార్ కి ఏలూరు పార్లమెంట్ ప్రజలంతా రుణపడి ఉంటారని ప్రశంసించారు.
సన్మాన కార్యక్రమంలో స్థానిక నేతలు ముమ్మడి చింతయ్య, ఇడా చైర్మన్ శివప్రసాద్, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ మహేష్, ఇతర నేతలు పాల్గొన్నారు.