THE DESK NEWS :
రైతులకు నిజమైన భరోసా ఇచ్చింది కూటమి ప్రభుత్వం !2024–25 ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ద్వారా చేపట్టిన 31,52,753 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. రూ.7222.35 కోట్లు చెల్లించాము. 5,00,352 మంది రైతులకు లబ్ధి చేకూరింది.
ఇదీ… మా ప్రభుత్వం సాధించిన ఘనత అని సంతోషంగా చెబుతున్నాము. ముఖ్యమంత్రి @ncbn , ఉప ముఖ్యమంత్రి @PawanKalyan రైతుల క్షేమం కోసం అనునిత్యం ఆలోచన చేస్తారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకున్న సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్.
రైతుల నుంచి మద్దతు ధరకు ధాన్యాన్ని సకాలంలో ప్రభుత్వం కొనుగోలు చేసింది. గ్రేడ్ వారీగా రైతులకు మద్దతు ధర ఇచ్చింది. రైతుల నుంచి కొనుగోలు చేసిన 24 గంటల్లో వారి అకౌంట్స్ లో డబ్బులు జమయ్యేలా చర్యలు తీసుకున్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విషయంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ముందున్నారు.
ఏ గ్రేడ్ ధాన్యం ధర క్వింటా రూ. 1750 లకు కొనుగోలు చేశారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది మంచి ధరే వచ్చిందని రైతులు చెబుతున్నారు.
వరదల్లో తడిసి బాగా నష్టపోయిన జిల్లాల్లో ధాన్యాన్ని 20 నుంచి 25 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి మనోహర్ ఆదేశించారు.
ఎప్పుడూ లేని విధంగా..
గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమకావడంతో రైతులు కూడా ఆనందంగా ఉన్నారు.
గత ప్రభుత్వం రైతులకు ఉంచిన బకాయి మొత్తం రూ. 1,674లు కూడా రైతుల ఖాతాల్లో జమచేసింది. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రైతులు నిత్యం శ్రమ చేసి పండించుకున్న ధాన్యానికి గిట్టుబాటు ధర రాకపోతే పడే బాధలు తనకు తెలుసునని, అందుకే రైతు సేవా కేంద్రాల ద్వారా ఒక్క గింజ కూడా వేస్ట్ కాకుండా ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు చెప్పారు.
ఇంత భారీ స్థాయిలో రైతుల నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి చెప్పిన ప్రకారం వెంటనే డబ్బులు ఇవ్వడం కూడా కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమైందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ, రైతుల సమయం వృథా కాకుండా వాట్సాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. 73373-59375 నెంబర్ ను ఇందుకు కేటాయించామన్నారు.