🔴 ఏలూరు జిల్లా : దెందులూరు : ది డెస్క్ :
“ప్రఖ్యాతిగాంచిన గాలయగూడెం శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం – అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్”
కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన దెందులూరు మండలం గాలాయగూడెంలోని శ్రీ అచ్చమ్మ పేరంటాలు తల్లి 69వ వార్షిక మహోత్సవాలను శనివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాంచనంగా ప్రారంభించారు.. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి ఆలయ కమిటీ మరియు స్థానిక కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.. అనంతరం అంతరాలయంలోని అచ్చమ్మ పేరంటాల తల్లి అమ్మవారికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారు ప్రజలందరినీ కాచి కాపాడాలని కోరుతూ పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కి వేద ఆశీర్వచనం అందించి అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు..

ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ…
“ప్రఖ్యాతిగాంచిన గాలయగూడెం అచ్చమ్మ తల్లి పేరంటాల ఉత్సవాల్లో పాల్గొనడానికి సుదూర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలి రానున్న నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అదేవిధంగా శాంతి భద్రతల అంశంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కమిటీ వారే పూర్తి సమన్వయంతో సమిష్టిగా పనిచేసి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. అమ్మవారి 69వ వార్షికోత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేదీ నుండి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు ఉత్సవాలు ఘనంగా నిర్వహించేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేయడం అభినందనీయమని, 69 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ఈ ఉత్సవాలు ఎంతో ప్రశాంతంగా నిర్వహిస్తున్నారన్నారు.
అయితే కొందరు ఉద్దేశ్య పూర్వకంగా దైవ కార్యక్రమాల్లో సైతం సమస్యలను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారని అటువంటి వారిపట్ల కమిటీ వారు కూడా అప్రమత్తంగా ఉండి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని, అదేవిధంగా ఉత్సవాల వేడుకల్లో పారిశుద్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతిరోజు రాత్రి సమయాల్లో భారీగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో వేడుకలు ముగిసిన మరుసటి రోజు ఉదయాన్నే పారిశుద్ధ్య పనులు చేపట్టి తిరిగి సాయంత్రం నాటికి ఆలయ పరిసర ప్రాంతాలు మొత్తం చక్కగా తీర్చిదిద్దేలా కమిటీ సభ్యులు చర్యలు చేపట్టాలని సూచించారు.. కూటమి తరపున అమ్మవారి ఆశీస్సులతో గెలుపొందిన తాను అమ్మవారి ఉత్సవాలకు అన్ని విధాల తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు..
ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధ్యక్షులు మోతుకూరి నాని, మండల రెవెన్యూ అధికారి బి సుమతి, గాలాయాగూడెం సొసైటీ చైర్మన్ పూజారి వెంకటరత్నం నాయుడు, గ్రామ పార్టీ అధ్యక్షులు పూజారి శ్రీనివాసరావు, మండల బిజెపి అధ్యక్షులు మొండూరు బుజ్జి గోపాల్, జగన్నాధపురం సొసైటీ ఛైర్మన్ డా.పసుమర్తి మధు, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఇప్పిలి వెంకటేశ్వర రావు (YVR), కూటమి నాయకు కమ్మ శివరామ కృష్ణ, పర్వతనేని రామకృష్ణ (సీతంపేట), పరసా వెంకటరావు, పెద్దిశెట్టి నాని, సీతారామ్ సహా పలువురు కూటమి నాయకులు, ఆలయా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

