The Desk…Delhi : ప్రకృతి విపత్తుల నిధులను పక్కదారి పట్టించింది వైకాపా ప్రభుత్వమే : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపణ

The Desk…Delhi : ప్రకృతి విపత్తుల నిధులను పక్కదారి పట్టించింది వైకాపా ప్రభుత్వమే : ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపణ

  • పార్లమెంటు సాక్షిగా వైఎస్ఆర్సీపీ ఎంపీలకు ఎంపీ పుట్టా మహేష్ వివరణ

దిల్లీ / ఏలూరు : THE DESK :

ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సమయంలో ప్రజలను ఆదుకోవడంలో గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అలాగే నిధులను పెద్ద ఎత్తున పక్కదారి పట్టించిందని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆరోపించారు.

విపత్తు నిర్వహణ సవరణ బిల్లు 2024 ఆమోదం సందర్భంగా గురువారం లోక్ సభలో జరిగిన చర్చ సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడారు. గత వైకాపా ప్రభుత్వం బుడమేరు అభివృద్ధిని విస్మరించడం వల్లే సెప్టెంబర్ లో కురిసిన వర్షాలకు విజయవాడ మునిగిపోయిందని ఎంపీ ప్రస్తావించారు.

విజయవాడ వరదల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధితులకు అండగా నిలిచారని, తమ కూటమి ప్రభుత్వం తక్షణం సహాయక చర్యలు చేపట్టడమే కాకుండా, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించారని, బాధితులకు పరిహారం అందించిన తర్వాతే చంద్రబాబు ఇంటికి వెళ్లారని, రెండు వారాలపాటు దగ్గరుండి చంద్రబాబు పర్యవేక్షించారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు.

వైఎస్ఆర్సిపి ప్రజా ప్రతినిధులు మాత్రం తమ ప్రభుత్వంపై బురదజల్లే విధంగా లోక్ సభలో మాట్లాడి సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారని ఎంపీ మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుడమేరు అభివృద్ధికి సంబంధించిన నిధులు, ప్రకృతి విపత్తులకు సంబంధించిన నిధులను కూడా గత వైకాపా ప్రభుత్వం పక్కదారి పట్టించడమే కాకుండా జేబులు నింపుకున్నారని ఎంపీ మహేష్ కుమార్ ధ్వజమెత్తారు.

గతంలో హుద్ హుద్ తుఫాన్ సమయంలో కూడా అల్లకల్లోలమైన విశాఖపట్నంను తిరిగి పునరుద్ధరించడమే కాకుండా బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా చేపట్టిన విషయాన్ని ఎంపీ మహేష్ కుమార్ గుర్తు చేశారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా గోదావరి నదికి వరదలు పోటెత్తి, పెదవాగుకు గండి పడి వేలేరుపాడు మండలం ముంపునకు గురైన సందర్భంలో కూడా తమ కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టి, సాధారణ పరిస్థితులు వచ్చేవరకు పర్యవేక్షించి, బాధితులకు అండగా నిలిచిందని ఎంపీ తెలిపారు.