THE DESK : SUPREME COURT :
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణచేయనున్న నేపథ్యంలో సుప్రీం ధర్మాసనం ఆయనకు ఘన వీడ్కోలు పలికింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ( నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు.)
ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమని.. అయినప్పటికీ తాను వృత్తిపరంగా పూర్తి సంతృప్తిగా ఉన్నానని చెప్పారు.
మరోవైపు సుప్రీం కోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులలైన సంగతి తెలిసిందే. నవంబర్ 11న జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ఇదివరకే వెల్లడించారు. 2025 మే 13 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు.