🔴 ఢిల్లీ : ది డెస్క్ :

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గౌరవ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరియు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు ఈ రోజు ఢిల్లీలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా, ఈ నెల 22వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ హాలులో ఎమ్మెల్యేల కోసం నిర్వహించనున్న ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించవలసిందిగా ఆయనను కోరారు.
ఓరియెంటేషన్ కార్యక్రమం మొదటి రోజు ప్రారంభోత్సవానికి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. రెండో రోజు కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేస్తారు. కార్యక్రమంలో శాసనసభ కార్యదర్శి జనరల్ ప్రసన్న కుమార్ సూర్యదేవర పాల్గొన్నారు.