The Desk… Cyber Crime : సైబర్‌ నేరగాళ్లు కాదు… సైబర్‌ బందిపోట్లు..! : సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌

The Desk… Cyber Crime : సైబర్‌ నేరగాళ్లు కాదు… సైబర్‌ బందిపోట్లు..! : సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌

NATIONAL : THE DESK :

AI ఆధారిత సైబర్‌ నేరాలతో మరింత ముప్పు..

బ్యాంకు ఖాతాల్ని కాదు.. డబ్బు సీజ్‌ చేయాలి..

వ్యక్తిగత భద్రతలాగానే ఆన్‌లైన్‌ భద్రత కూడా..

ప్రజల వివరాలన్నీ ఆన్‌లైన్‌ అంగట్లో అమ్మకానికి‘..

సోషల్‌’ వేధింపుల బారినపడుతున్న యువత..

కఠిన శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి..

సైబర్‌ కేటుగాళ్ల బారిన పడ్డ నష్టపోయినవారుగంటలోగా ఫిర్యాదు చేస్తే ఎక్కువ ప్రయోజనం..

సీఆర్‌సీఐడీఎఫ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రసాద్‌ వెల్లడి

నానాటికీ గణనీయంగా పెరుగుతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట పడాలంటే ప్రజల్లో వాటిపై అవగాహన, అప్రమత్తత ముఖ్యమని.. సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరెన్సిక్స్‌ (సీఆర్‌సీఐడీఎఫ్‌) వ్యవస్థాపక సంచాలకుడు డాక్టర్‌ ప్రసాద్‌ పాటిబండ్ల తెలిపారు.

AI డీప్‌ ఫేక్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాల సాయంతో సైబర్‌ నేరగాళ్లు మున్ముందు మరింత పెద్ద ఎత్తున మోసాలకు తెగబడతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

వృద్ధులను మోసం చేసి వారి పదవీ విరమణ ప్రయోజనాలను దోచుకుంటున్నవారిని కేవలం ‘సైబర్‌ నేరగాళ్లు’ అంటే సరిపోదని.. వారిని ‘సైబర్‌ బందిపోట్లు’గా వ్యవహరించాలని ఆయన అభిప్రాయపడ్డారు.