🔴 ఏలూరు జిల్లా : చింతలపూడి : ది డెస్క్ :
చింతలపూడిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న 58 మంది విద్యార్థులకు మాస్టారు, దాత కంచర్ల బుచ్చిబాబు సహాయంతో ప్యాడ్లు మరియు పెన్నులను సీఐ క్రాంతి కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ..
కష్టపడితేనే ఫలితం దక్కుతుందని, తల్లిదండ్రులు కష్టపడి పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టానికి ప్రతిఫలంగా ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకోవాలని సూచించారు. మన భవిష్యత్తును, తలరాతను మార్చుకునేందుకు చదువు ఒక్కటే శక్తివంతమైన ఆయుధమని అన్నారు. పదవ తరగతి పరీక్షలను ఎటువంటి భయం లేకుండా రాయాలని, కంగారు పడకుండా ముందుగా తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాయాలని సూచించారు. రైటింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసి పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.10వ తరగతి, ఇంటర్ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంతో కీలకమైన దశలని పేర్కొంటూ ప్రేమ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలంటే చదువుతోనే ముందుకు సాగాలని, చదువు ఒక్కటే విజయానికి మార్గమని తెలిపారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, దాత కంచర్ల బుచ్చిబాబు మాట్లాడుతూ..
మంచి మార్కులు సాధించేందుకు కష్టపడాలని, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ఎంత కష్టపడితే అంత ఫలితం దక్కుతుందని, కష్టపడి చదివితే మంచి ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. మంచి ఫలితాలు భవిష్యత్తుకు పునాదులని, విద్యార్థులు కష్టపడి గ్రామం, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ కే.వి. దుర్గారావు, బుల్లయ్య, సీహెచ్. పుష్పవతి మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Stationery Distributed to Class 10 Students in Chintalapudi
CI Kranti Kumar Urges Hard Work, Exam Focus Amid Distribution Event
In a heartwarming gesture, 58 Class 10 students of Zilla Parishad Balura High School here received pads and pens, donated by philanthropist Kancharla Bucchibabu and facilitated by school staff. The distribution was handed over by Circle Inspector (CI) Kranti Kumar.
Speaking on the occasion, CI Kranti Kumar motivated students to study diligently, honoring their parents’ sacrifices through laborious jobs. “Hard work alone yields results; education is the powerful weapon to shape your future and family legacy,” he said, advising fearless exam approach—start with known questions and hone writing skills. He cautioned against bad habits like premature romance, emphasizing 10th and Intermediate as pivotal stages for strong foundations leading to good jobs.
Teachers and donor Bucchibabu echoed the call, urging planned studies for top marks, school prestige, and village pride. “Efforts bring proportional success; excel to bring glory,” they added.
The event saw participation from First Assistant K.V. Durgarao, Bulleyya, S.H. Pushpavati, and other faculty, underscoring community support ahead of board exams.

