The Desk…CHINTALAPUDI : ‎పల్లెలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ➖ఎంపీ పుట్టా మహేష్

The Desk…CHINTALAPUDI : ‎పల్లెలను నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ➖ఎంపీ పుట్టా మహేష్

చింతలపూడి నియోజకవర్గం వేములపల్లి గ్రామంలో “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం

గ్రామస్థులతో ఎంపీ ముఖాముఖి

సమస్యలు అడిగి తెలుసుకున్న ఎంపీ.

పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు.

పల్లెల ప్రగతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఎంపీ.

ఏలూరు జిల్లా : చింతలపూడి నియోజకవర్గo : ది డెస్క్ :‎

గ్రామాలలోని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం చేపట్టినట్లు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడించారు. ‎చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమంలో ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.

సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ…

పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందన్నారు. గ్రామస్థులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు తమను ఆశీర్వదించి కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ఒకే ప్రభుత్వం 20 నుంచి 30 ఏళ్లు అధికారంలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెంది పల్లెలు, పట్టణాలు అన్నీ బాగుపడతాయన్నారు. ఇందుకు గుజరాత్ రాష్ట్రమే ఉదాహరణ అన్న ఎంపీ, గత ప్రభుత్వం వలె కాకుండా అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకు వెళుతున్న కూటమి ప్రభుత్వాన్ని 30 ఏళ్ళు గెలిపిస్తే రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తుందని స్పష్టం చేశారు.

‎ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ..

కూటమి ప్రభుత్వంలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువనేత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వచ్చే తరాల భవిష్యత్తు కోసమే రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. వేములపల్లి గ్రామంలో “మన పల్లెకు మన ఎంపీ” కార్యక్రమం సందర్భంగా శ్మశాన వాటిక, మంచినీటి సమస్యలను గ్రామస్థులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ శ్మశాన వాటికకు గ్రామంలో స్థలం చూపితే నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చారు.

మంచినీటి ట్యాంకు నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొంతమంది రైతులు పట్టాదారు పాసుపుస్తకాలు గురించి, పొలాలకు వెళ్ళే రోడ్లు, భూముల రీసర్వే ఇబ్బందుల గురించి, పెన్షన్ల గురించి ప్రస్తావించారు. వీటిపై స్పందించిన ఎంపీ అక్కడికక్కడే ఎమ్మెల్యే రోషన్ కుమార్ తో చర్చించి అధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో గ్రామ ప్రజలు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.