- QCI ఆధ్వర్యంలో నిర్వహించే సదస్సు – హస్తినకు పయనమైన సర్పంచ్
- సర్పంచ్ లక్ష్మీ సునీతకు అరుదైన అవకాశం
🔴 ఏలూరు జిల్లా : ఉంగు టూరు మండలం : ది డెస్క్ :

చేబ్రోలు సర్పంచి రాంధే లక్ష్మీసునీతకు అరుదైన అవకాశం దక్కింది. దిల్లీలో ఈనెల సెప్టెంబర్ 15న *భారత నాణ్యత మండలి (క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)QCI ఆధ్వర్యంలో నిర్వహించనున్న* ‘సర్పంచ్ సంవాద్ కాన్ క్లేవ్’ కు ఆమెకు ఆహ్వానం అందింది. జలశక్తి మంత్రిత్వ శాఖ సహకా రంతో జరగనున్న సదస్సుకు దేశవ్యాప్తంగా 75 మంది సర్పంచులను ఎంపిక చేయగా.. అందులో లక్ష్మీసునీత స్థానం దక్కించుకు న్నారు.
గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగం.. గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల పరిష్కారంపై సర్పంచులు తమ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకోనున్నారు.
ఇప్పటికే లక్ష్మీసునీత రెండు సార్లు ‘సర్పంచ్ సంవాద్’ పోటీల్లో *జాతీయ స్థాయిలో* మెరిశారు.మరియు…జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ (దిశ) కమిటీ సభ్యురాలిగా చేబ్రోలు సర్పంచ్ లక్ష్మి సునీత ఎన్నిక అవడం పట్ల గ్రామస్తులు, శ్రేయోభిలాషులు, పలువురు సర్పంచ్ సునీతను అభినందించారు.