The Desk…Buttayigudem : కామయ్య కుంట గ్రామపంచాయతీ వద్ద “బీట్ ది హీట్” పై అవగాహన

The Desk…Buttayigudem : కామయ్య కుంట గ్రామపంచాయతీ వద్ద “బీట్ ది హీట్” పై అవగాహన

🔴 ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం మండలం : కామయ్య కుంట : ది డెస్క్ :

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర ” కామయ్య కుంట గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమ సందర్భంగా స్పెషల్ మీటింగ్ నిర్వహించి ఈనెల ప్రత్యేక అంశం అయిన BEAT THE HEAT అనగా.. వేసవి ఎండ తీవ్రతను తగ్గించుటకు గ్రామ ప్రజలు, పిల్లలు, వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలందరికీ అవగాహన కల్పించి గ్రామంలో చలివేంద్ర కేంద్రాలు, పశువులకు, పక్షులకు నీటి తొట్టెలు, మొక్కలు నాటుట, వృద్ధులకు హెల్త్ క్యాంపులు మరియు గ్రామంలో ఉన్న హాస్టల్స్ లోను, ఇండ్లలోను మలేరియా మందు స్ప్రే చేసే కార్యక్రమం నిర్వహించడమైనది.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు, విలేజ్ రెవెన్యూ అధికారులు, సచివాలయ సిబ్బంది,మెడికల్ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.