- రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు అండగా నిలిచిన ఎంపీ మహేష్ కుమార్
- మరో వాహనంలో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన ఎంపీ మహేష్ కుమార్
ఏలూరు జిల్లా : బుట్టాయిగూడెం : THE DESK :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అండగా నిలిచారు.
టీడీపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనెందుకు ఎంపీ మహేష్ కుమార్ కువ్వాడ నుంచి బుట్టాయిగూడెంనకు టిడిపి జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు తో కలిసి గురువారం బయల్దేరారు.
మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా వస్తున్న కారు ఢీకొనడంతో కన్నాపురం గ్రామానికి చెందిన సరికొప్పుల గంగరాజు అతని భార్య గాయపడ్డారు.
కళ్ళముందే ప్రమాదం జరగడంతో స్పందించిన ఎంపీ మహేష్ కుమార్ కారులో నుంచి కిందకు దిగి గంగరాజు దంపతులను పరామర్శించారు. ఎంపీ ఆదేశాల మేరకు వ్యక్తిగత సిబ్బంది గంగరాజు దంపతులకు సపర్యలు చేశారు.
ద్విచక్ర వాహనం ధ్వంసం కావడంతో క్షతగాత్రులకు కొంత ఆర్థిక సాయం అందించిన ఎంపీ మహేష్ కుమార్ వారిని మరో వాహనంలో ఆసుపత్రి తరలించారు.
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారూ వివరాలు సేకరించాలని ఎంపీ మహేష్ కుమార్ పోలీసులను ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను అటుగా వెళ్తున్న వాహన చోదకులు ప్రశంసించారు.