The Desk … Bhimavaram : పార్టీ కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

The Desk … Bhimavaram : పార్టీ కార్యాలయంలో ఘనంగా పూలే జయంతి వేడుకలు

🟡 పగో జిల్లా : భీమవరం నియోజకవర్గం : ది డెస్క్ :

మహాత్మా జ్యోతిరావు ఫూలే 199 జయంతి సందర్బంగా.. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

సందర్భంగా కోళ్ల నాగేశ్వరావు మాట్లాడుతూ :

భారత దేశంలో మొట్టమొదట మహాత్మ అని పిలిచే వ్యక్తి, మహోన్నత వ్యక్తి, అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అని, మహిళల కోసం పాఠశాల ఏర్పాటు చేసి వారిని ఉన్నతస్థానంలోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించిన వ్యక్తి అని.. రాబోయే తరాలకు కూడా పూలే యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.