🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
దేవస్థానం అసిస్టెంట్ కమీషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ ఆధ్వర్యంలో హుండీలు తెరచి లెక్కించారు. 26 రోజుల కాలానికి హుండీల ద్వారా 25,63,619/- (ఇరవై ఐదు లక్షల అరువది మూడు వేలు ఆరు వందల పందోమ్మిది రూపాయలు) లభించగా.. బంగారం 30 గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 55 గ్రాములు హుండీ ద్వారా భక్తులు సమర్పించుకున్నారు. కాకినాడ పట్టణం MSN చారిటీస్ అసిస్టెంట్ కమిషనర్ చాగంటి సురేష్ నాయుడు పర్యవేక్షణలో జరిపిన ఈ లెక్కింపులో ఆలయ ప్రధానార్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ, ఆలయ చైర్మన్ బొండాడ నాగ భూషణం, ధర్మకర్తలు, రామాయణం శ్రీనివాస్, ఉదీశి మీనాక్షి, , జి రమణ, మిర్తిపాటి గుణేశ్వరరావు, అతికెల ఆంజనేయ ప్రసాద్, మల్లువలస లక్ష్మి నిర్మల మత్యపురి గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి రఘునాథ్, కలిగొట్ల గ్రూప్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి మంతెన రామరాజు మరియు కరూర్ వైశ్య బ్యాంకు సిబ్బంది, పోలీస్ సిబ్బంది,ఆలయ సిబ్బంది పాల్గొన్నారని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మరియు కార్యనిర్వహణదికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్ ఓ ప్రకటనలో తెలిపారు.
Mavullamma Temple Hundi Yields Rs 25.63 Lakh in 26 Days
In a meticulously supervised process, the Mavullamma Temple’s hundi was opened and counted under the guidance of Devastanam Assistant Commissioner Buddha Mahalakshmi Nagesh. Over 26 days, devotees contributed Rs 25,63,619 (twenty-five lakh sixty-three thousand six hundred nineteen rupees), along with 30 grams and 200 milligrams of gold, and 55 grams of silver.
The counting, overseen by Kakinada’s MSN Charities Assistant Commissioner Chaganti Suresh Naidu, involved temple chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma, chairman Bonda Nagabhushanam, dharmakartas including Ramayanam Srinivas, Udishi Meenakshi, G Raman, Mirtipati Guneswararao, Atikel Anjaneya Prasad, and Malluvalasa Lakshmi Nirmala, along with group temple officials Raghunath and Manten Ramaraju. Karur Vysya Bank staff, police, and temple personnel also participated, Mahalakshmi Nagesh confirmed in a statement.

