🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లాకు చెందిన MLC ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు MLC కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన MLC MV రామచంద్ర రెడ్డి మావూళ్ళమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు మండలి స్వాగతం పలికగా.. అర్చకులు పూజలు ఆశీర్వచనాలు నిర్వహించారు.
దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి శేషవస్త్రం, ప్రసాదం, జ్ఞాపిక అందచేసారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తలు,, దేవదాయ ధర్మదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాధరావు, చీఫ్ ఇంజనీర్ జి శేఖర్, D.E శ్రీనివాస్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ అసిస్టెంట్ కమిషనర్ V.హరిసూర్య ప్రకాష్, భీమవరం దేవదాయ ధర్మదాయ శాఖ తనికిదారు వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

