🔴 ప.గోజిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో నేడు కార్తీకమాసం ఆఖరి రోజు అమావాస్య సందర్భంగా.. భక్తులు కష్టాలు తొలగిపోయి సిరి సంపదలు పొందాలన్న సంకల్పంతో.. విశేషమైన చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు, వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు.

ఈ హోమంలో వందమంది పైగా పాల్గొన్నారని, పరోక్షంగా మరికొంతమంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.

