The Desk … Bhimavaram : అన్నపూర్ణాదేవి అలంకరణలో మావుళ్ళమ్మ!!

The Desk … Bhimavaram : అన్నపూర్ణాదేవి అలంకరణలో మావుళ్ళమ్మ!!

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా.. ఈరోజు శుక్రవారం అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.

భీమవరం వాస్తవ్యులు పళని అప్పన్ గీత దంపతులు అమ్మవారి అలంకరణకు కావలసిన ఉపకరణములు బహుకరించారు.

ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లాలని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.

Mavullamma Shines as Annapurna Devi in Bhimavaram Temple Fete

During the annual festival at Ilavelpu Mavullamma temple, the deity graced devotees as Annapurna Devi on Friday. Palani Appan Geeta couple donated ornaments. Head priest Brahmasri Maddirala Mallikharjuna Sharma conducted rituals. Assistant Commissioner Budda Mahalakshmi Nagesh and Chairman Bondada Nagabhushanam wished devotees prosperity.