🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :
భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ ఆలయ వార్షికోత్సవాల్లో భాగంగా.. ఈరోజు గురువారం ధనలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. యీవని సూర్య సంపత్ దంపతులు అమ్మవారి అలంకరణకు కావలసిన ఉపకరణములు బహుకరించారు.
ఈసందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ పూజలు నిర్వహించారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లాలని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.
Mavullamma Shines in Dhanalakshmi Alankaram at Bhimavaram Temple
During the annual festival at Ilavelpu Mavullamma temple, the deity graced devotees in Dhanalakshmi alankaram on Thursday. Yevani Surya Sampath and family donated the adornments. Head priest Brahmasri Maddirala Mallikharjuna Sharma conducted rituals. Devotees received theertha prasadam. AC & EO Budda Mahalakshmi Nagesh and chairman Bondada Nagabhushanam prayed for their prosperity.

