The Desk … Bhimavaram : అన్నపూర్ణ దేవిగా దర్శనమివ్వనున్న మావుళ్ళమ్మ

The Desk … Bhimavaram : అన్నపూర్ణ దేవిగా దర్శనమివ్వనున్న మావుళ్ళమ్మ

🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పట్టణంలో శుభాభ్యుదయ శోభితమై, మంగళకరమైన అమ్మవారి భోగి, మకరసంక్రాతి, కనుమ పండుగల సందర్భంగా భోగభాగ్యాలను, సుఖ సంతోషాలను,ఆయురారోగ్యాలను అనుగ్రహించే శక్తి స్వరూపిణిగా విరాజిల్లుతున్న మావుళ్ళమ్మకు ప్రతిఏడాది వలే ఈఏడాది కూడా మాఘ బహుళ చవితి ఈనెల 5వతేది గురువారం నుండి మాఘ బహుళ దశమి అనగా 12 వ తేది గురువారం వరకు అష్టలక్ష్మి అలంకరణలలో మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం నాడు అన్నపూర్ణా దేవి అలంకరణలో మావుళ్ళమ్మ బ్రహ్మోత్సవ సంబరాలలో భక్తులను అనుగ్రహించనున్నారని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ తెలిపారు. భక్తులు మావుళ్ళమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి సిరి సంపదలు, సుఖ సంతోషాలతో భక్తులు, వారి కుటుంబం వర్ధిల్లగలరని అసిస్టెంట్ కమీషనర్ & కార్యనిర్వహణాధికారి బుద్ద మహాలక్ష్మి నగేష్ మరియు చైర్మన్ బొండాడ నాగభూషణం ,ధర్మకర్తలు మండలి సభ్యులు కోరారు.

Mavullamma to Grace Devotees as Annapurna Devi in Bhimavaram.

In a festive highlight amid Bhogi, Makara Sankranti, and Kanuma celebrations, Mavullamma—embodying prosperity, joy, and well-being—will dazzle in Ashtalakshmi adornments from January 5 (Magha Bahula Chaviti) to 12 (Dashami). On Magha Bahula Ekadashi (Friday), she manifests as Annapurna Devi during Brahmotsavam, announced temple chief priest Brahmasri Maddirala Mallikharjuna Sharma. Devotees are urged to seek darshan, receive theertha prasadam for family wealth and health, by Asst. Commissioner Buddha Mahalakshmi Nagesh, Chairman Bondada Nagabhushanam, and trustees.