ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి సంపూర్ణ స్వర్ణ అలంకరణ కొరకు జగన్నాధపురంకి చెందిన మంతెన పాండు రంగరాజు, సాయి మౌనిక దంపతులు సుమారు రెండు లక్షల ముప్పది వేలు రూపాయలు విలువచేసే 20 గ్రాముల బంగారం స్థానిక శాసన సభ్యులు మరియు PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా..దేవస్థానం అధికారులకు అందచేసారు.
వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనాలు అందచేయగా..దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం, ఫోటో దాతలకు అందచేసారు..
ఈ సందర్బంగా శాసనసభ్యులు మాటడుతూ...దాతలకు అమ్మవారు అనుగ్రహం ఉండాలని శ్రీ మావుళ్ళమ్మ తల్లిని కోరుతున్నామని తెలిపారు.

