The Desk… Bhimavaram : దేవాలయ అధికారుల సమక్షంలో తెరిచిన సీల్డ్ టెండర్లు

The Desk… Bhimavaram : దేవాలయ అధికారుల సమక్షంలో తెరిచిన సీల్డ్ టెండర్లు

🔴 పగో జిల్లా : భీమవరం మండలం :

గునుపూడి సోమేశ్వర జనార్థనస్వామి దేవస్థానం నందు జరుగబోవు వార్షిక కళ్యాణోత్సవ సందర్భముగా ది.13-02-2026 నుంది ది.17-02-2026 వరకు దేవాలయము నందు వివిధ సీల్డ్ టెండర్లు దాఖలు కాబడినవి. ఈ రోజు ది.09-01-2026 వ తేదీ గం.10-00లకు ఆలయం నందు టెండరు దార్లు సమక్షములో వర్దినీడి వెంకటేశ్వర రావు, తనిఖీదారు దేవదాయధర్మాదాయ శాఖ, మరియు తోట శ్రీనివాసరావు, భీమేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి సమక్షములో టెండర్లు తెరుచుట జరిగినది.

ఈ కార్యక్రమంలో దేవాలయం చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు పడమట లీల, కొప్పర్తి విజయ కుమార్ మరియు బ్రహ్మజోశ్యుల సత్య ప్రసాద్ పాల్గొన్నారు.