🔴 పగో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పట్టణంలో వేంచేసి ఉన్న మావుళ్లమ్మ అమ్మవారి నిజారూప పునఃదర్శనం కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారు స్వర్ణఆభరణాలతో అత్యంత శోభాయమానంగా దర్శనం ఇవ్వడంతో…భక్తులు అనిర్వచనీయమైన ఆనందానుభూతి చెందారు. తెల్లవారుజామున నుండి. ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ మరియు వేదపండితులు మండపారాధన, నమక చమకాలతో రుద్ర హావనం, అష్ట దిక్పాలక నవగ్రహ వాస్తు, కళా విశేష హోమాలు అనంతరం కళాన్యాసం పూజలు జరిపి పునఃదర్శనం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని దర్శనం చేసుకొన్నారు. స్థానిక శాసన సభ్యులు మరియు PAC చైర్మన్ పులపర్తి రామాంజనేయులు పాల్గొన్నారు వీరికి ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ శేషవస్త్రం, ప్రసాదం అందచేసారు. అత్యంత కళా కాంతులతో తేజోవంతంగా దర్శనం ఇస్తున్న మావుళ్ళమ్మ అమ్మవారిని కుటుంబంతో సహా దర్శనం చేసుకొని సిరి సంపదలు, సౌభాగ్యాన్ని పొందాలని ఆలయ అధికారులు తెలిపారు.
Mavullamma Ammavari Pradarshan Begins Grandly
The much-awaited true form pradarshan of Goddess Mavullamma Ammavari, housed in Bhimavaram town, commenced with great splendor. Adorned in golden jewelry, the deity’s radiant appearance filled devotees with indescribable joy.
From dawn, chief priest Maddirala Mallikarjuna Sharma and Vedic scholars performed mandaparchana, namakam-chamakam, Rudra Havanam, Ashta Dikpalaka Navagraha Vastu, and special Kala Homas, followed by Kala Nyaasa Pooja to inaugurate the event.
Large crowds attended, including local MLA and PAC Chairman Pulaparthi Ramanjaneyulu, who received seshavastram and prasadam from temple assistant commissioner Buddha Mahalakshmi Nagesh. Officials urged families to seek her blessings for prosperity.

