The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ దీక్షదారులచే జ్యోతులు ఊరేగింపు అత్యద్భుతం

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ దీక్షదారులచే జ్యోతులు ఊరేగింపు అత్యద్భుతం

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

పురాధీశ్వరి శ్రీ మావుళ్ళమ్మ దేవస్థానం నందు వందలాది శ్రీ అమ్మవారి మాల దీక్షదారులచే జ్యోతులు పట్టుకొని ఊరేగింపు కార్యక్రమం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత ఘనంగా జరిగింది. దేవాలయంలో శ్రీ అమ్మవారి సన్నిధిలో దీక్షపరులైన యువతులు ఖడ్గాలు ధరించి చేసిన నృత్యం ఆకట్టుకొంది. గత బుధవారం రాత్రి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మ శ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ ప్రత్యేక పూజలు జరిపి.. జ్యోతి ఊరేగింపు ప్రారంభించారు.

ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మినగేష్ పర్యవేక్షణలో..

శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి సోమేశ్వరస్వామి గుడి, సోమగుండం చెరువు, నాచువారి సెంటర్, సింహాద్రి అప్పన్న దేవస్థానం, తాలూకా ఆఫీస్ రోడ్డు మీదుగా దీక్ష పరులు జై మావుళ్ళమ్మ తల్లి నినాదాలతో మార్మోగి.. ఊరేగింపు తదనంతరం శ్రీ అమ్మవారి దేవస్థానం చేరుకొన్నారు…

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక అలంకరించిన వాహనాలు, భక్తులతో పాటుగా పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకొన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో శ్రీ అమ్మవారి ప్రభ, కీర్తి మరింత ప్రబలం అయ్యేలా వరుసగా భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్న దేవాలయ సిబ్బందికి ధర్మాదాయ శాఖకు పలువురు అభినందనలు తెలిపారు.