🔴 పగో జిల్లా : భీమవరం మండలం : పెదఅమిరం : ది డెస్క్ :

పెదఅమిరం గ్రామ పంచాయితీ “స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర.. “పర్యావరణం” కార్యక్రమములో భాగంగా… SWPC షెడ్డు వద్ద మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..
ప్రతి గ్రామంలోనూ, ప్రతి ఇంటి పరిసరాలవద్ద అందరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి గణనీయమైన ప్రయోజనాలు చేకూరుస్తాయని, అలాగే కార్బన్ను వాతావరణం నుండి తొలగించి, వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయని, గాలిని, నీటిని ఫిల్టర్ చేసి, పరిసరాలను చల్లబరుస్తాయని, శబ్ద కాలుష్యాన్ని 40% వరకు తగ్గించి, వన్యప్రాణులకు ఆహారం, ఆశ్రయం అందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నాగేంద్ర, గ్రామ సర్పంచ్ సోమేశ్వర రావు, కూటమి నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

