The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్

The Desk…Bhimavaram : శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న రాష్ట్ర సమాచార కమిషనర్

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం మావుళ్ళమ్మ అమ్మవారిని స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ చావలి సునీల్ దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. అనంతరం ప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపికను అందచేసారు.

అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు మరియు జాకెట్ ముక్కలు వేలంపాట ద్వార 30,940/- ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.

మహిళలు చీరలు కోసం పోటీ పడి సగంధరకే వస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా అమ్మవారి చీరలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో భీమవరం దేవదాయ ధర్మదాయశాఖ తనిఖిదారు v. వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

State Information Commissioner Chavali Sunil visited the revered Mavullamma temple in Bhimavaram town, west godavari district. Welcomed with full rituals by chief priest Brahmasri Maddirala Mallikarjuna Sharma, the commissioner received prayers, blessings, and prasadam. Temple assistant commissioner Buddha Mahalakshmi Nagesh reported that sales of sarees and jackets offered by devotees raised ₹30,940. Notably, women competed to buy these sacred sarees, reflecting strong devotional sentiment. Devadaya Dharma department inspector V. Venkateswararao also attended the event.