The Desk…Bhimavaram : కనకాంబర పుష్ప గజమాలాంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ

The Desk…Bhimavaram : కనకాంబర పుష్ప గజమాలాంకరణతో భక్తులకు దర్శనమిచ్చిన భీమవరం శ్రీ మావుళ్ళమ్మ

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి భక్తుడు సమర్పించిన కనకంబరాలతో గజమాల అమ్మవారికి అలంకరణ చేయడంతో.. అమ్మవారు కళా కాంతులతో దర్శనం ఇవ్వడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలు మరియు జాకెట్ ముక్కలు దేవస్థానం అధికారులు వేలంపాట నిర్వహించగా.. భక్తురాళ్ళు చీరలు కొనుగోలుకు పోటీపడి కొనుగోలు చేశారు. వీటిని విక్రయించడం ద్వారా 33,480/- ఆదాయం ఆలయానికి వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు.

ఈ ప్రక్రియ బుధ,శుక్ర మరియు ఆదివారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం1గంట వరకు చీరలు వేలం పాట జరుగుతుందని తెలిపారు.

In Bhimavaram town, devotees adorned the revered goddess Sri Mavullamma with golden garlands as part of a special ritual. The temple held an auction of sarees and jacket pieces offered by worshippers, which attracted eager buyers. The auction generated ₹33,480 in revenue for the temple, according to temple assistant commissioner Buddha Mahalakshmi Nagesh.

The auction event is scheduled to continue on Wednesday, Friday, and Sunday mornings from 9 AM to 1 PM, delighting devotees and supporting temple activities.