The Desk…Bhimavaram : మార్గశిర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించిన ఆలయ అధికారులు

The Desk…Bhimavaram : మార్గశిర పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించిన ఆలయ అధికారులు

🔴 ప.గో జిల్లా : భీమవరం : ది డెస్క్ :

భీమవరం పట్టణంలో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్య దైవం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ మహాలక్ష్మి ప్రదమాసంలో వచ్చిన మార్గశిర పౌర్ణమి సందర్బంగా.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో భక్తులు సిరి సంపదలు పొందాలన్న సంకల్పంతో.. విశేషమైన చండీహోమం దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లిఖార్జున శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేదపారాయణ దారులు ఘనంగా నిర్వహించారు.

ఈ హోమం లో ప్రత్యక్షంగా వందమందికి పైగా పాల్గొన్నారని.. పరోక్షంగా కూడా మరి కొంతమంది పాల్గొన్నారని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలియచేసారు. తీర్థ ప్రసాదాలు అందించిన అనంతరం మేళ తాళాలతో చండీ హోమం చేయుంచుకున్న భక్తులకు ప్రత్యేక దర్శనం చేయించి, అన్న సంతర్పణలో ప్రసాదాలు పంపిణీ చేశారు.