🔴 ఎన్టీఆర్ జిల్లా : వత్సవాయి మండలం : భీమవరం గ్రామపంచాయతి : ది డెస్క్ :
భీమవరం గ్రామపంచాయతి పరిధిలో “స్వచ్చ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర” (SASA) కార్యక్రమములో “గ్రీన్ ఆంధ్ర” థీమ్ గా మొక్కలు నాటు కార్యక్రమము నిర్వహించకబడినది. సదరు కార్యక్రమమునకు ముఖ్య అతిధులుగా జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీరాం రాజగోపాల్, జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ జి. లక్ష్మిశా పాల్గొన్నారు.
భీమవరం గ్రామపంచాయతి పరిధిలోని జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్ ప్రహరీ బయటి వైపు హరిత వనం ఏర్పాటు నిమిత్తం 200 మొక్కలు నాటు కార్యక్రమములో విధ్యార్థి, విద్యార్థినిలతో కలసి మొక్కలు నాటారు.

భీమవరం గ్రామపంచాయతి “ఘన వ్యర్ధముల నిర్వహణ కేంద్రము” (SWPC)నందు పని చేయుచున్న హరిత రాయబారులను దుశ్సాలువాలతో సత్కరించి, వారికి రక్షణ వస్తువులు అందించారు.భీమవరం గ్రామపంచాయతి పరిధిలో ప్రతిరోజూ క్రమము తప్పకుండా గృహ వ్యర్ధములను తడి చెత్త, పొడి చెత్త మరియు హానికర చెత్త లను SWPC షెడ్ వద్దే వేరు చేసి హరిత రాయబారులకు అందచేయుచున్న 10 మంది మహిళలకు ప్రశంసా పత్రము అందచేసి, మొక్కను బహుమతిగా ఇచ్చారు.

గ్రామము నందలి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ వారిచే గర్భిణీ స్త్రీ లకు నిర్వహించబడిన సామూహిక సీమంతము కార్యక్రమము నిర్వహించారు.

గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కలెక్టర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సభ నందు ప్రజాలచే “స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర” ప్రతిజ్ఞ చేయించి, స్వచ్చ ఆంధ్ర మరియు హరిత ఆంధ్ర కార్యక్రమములు అమలు, వాటి నందు జరుగుచున్న పురోగతి ప్రజలకు వివరించి..

విజన్ 2047 మరియు P4 మార్గదర్శులు భంగారు కుటుంబములు గురించి ప్రజలకు వివరించి.. తదుపరి విధ్యార్ధి, విద్యార్థినీలతో గ్రామము నందు నిర్వహించబడిన “హరిత ఆంధ్ర” ర్యాలీ నందు పాల్గొన్నారు.