ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : ది డెస్క్ న్యూస్ :

భీమడోలు గ్రామంలో ఈ నెల 07 (శుక్రవారం) నుండి నెల రోజుల పాటు జరుగు శ్రీ అమ్మవార్ల (శ్రీ గంగానమ్మ, శ్రీ మహాలక్ష్మమ్మ, శ్రీ మద్దిరావమ్మ, శ్రీ పోతురాజు బాబు గార్ల ) జాతర మహోత్సవాలలో ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా MLA పత్సమట్ల ధర్మరాజు స్థానిక నేతలు, జాతర కమిటీ సభ్యులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొని, తీర్ధ ప్రసాదలు స్వీకరించారు.

ఈ సందర్భంగా MLA ధర్మరాజు మాట్లాడుతూ… 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ జాతర మహోత్సవలను ఎంతో వైభవంగా నిర్వహించటం జరుగుతుందని,ఈ యొక్క జాతర మహోత్సవలను అందరూ సమిష్టిగా విజయవంతం చేయ్యాలని, జాతరకు విచ్చేసే భక్తులకి అవసరమైన సౌకర్యలను కల్పించాలని ఆలయ కమిటీ సభ్యులకి సూచించారు.
కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం ముఖ్య కూటమి నాయకులు, భీమడోలు మండలం జనసేన, టీడీపీ, బీజేపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు,జాతర కమిటీ సభ్యులు,వీర మహిళలు, తెలుగు మహిళలు, తదితరులు పాల్గొన్నారు.