🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :

గ్రామంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని భీమడోలు గ్రామపంచాయతీ కార్యదర్శి తనూజ అన్నారు.

సోమవారం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా భీమడోలు పంచాయతీ కార్యాలయం నుంచి గాంధీ బొమ్మ వరకు సచివాలయ, పంచాయతీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులతో కలిసి జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు.
వందేమాతరం అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో వెజ్జు వినయ్, ప్రతాప్, పైడిమాల యుగంధర్, సత్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు.