🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :మూడవ శనివారం :

భీమడోలు గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మూడవ శనివారం “స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర “కార్యక్రమ సందర్భంగా స్పెషల్ మీటింగ్ నిర్వహించారు.
కార్యక్రమంలో *“సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం – పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించడం”* గురించి తెలియజేస్తూ..*కళా జాత* బృందం వారిచే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి , అవగాహన కార్యక్రమం చేపట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిగే హాని గురించి అవగాహన కల్పించారు.
ఈ ముప్పును అరికట్టడానికి తయారీదారులు తగిన శ్రద్ధ వహించాలని పిలుపునిచ్చారు.ప్లాస్టిక్, పాలిథిన్ వాడకాన్ని నివారించినప్పుడే పల్లెల్లో స్వచ్ఛత ఉంటుందని , మరియు వ్యాపార వాణిజ్య దుకాణాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉపయోగం నియంత్రించాలని , గ్రామాలు పరిసర ప్రాంతాలు మండలాలు ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా ఉండాలని ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు.
కార్యక్రమంలో ప్రత్యేక అధికారి RV నాగరాణి , MRO రమాదేవి..పంచాయతీ కార్యదర్శి తనూజ , గ్రామ ప్రజలు మరియు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.