The Desk…Bhimadole : భీమడోలులో ఏలూరు డీఎస్పీ విద్యార్థులకు అవగాహనా సదస్సు…

The Desk…Bhimadole : భీమడోలులో ఏలూరు డీఎస్పీ విద్యార్థులకు అవగాహనా సదస్సు…

ఏలూరు జిల్లా : భీమడోలు : ది డెస్క్ :

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, సోషల్ మీడియా స్నేహాలు పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ అన్నారు.

శనివారం భీమడోలు మానసా పాఠశాలు ఆవరణలో విద్యార్థులకు మాదకద్రవ్యాలు వాడకం దుష్పరిణామాలు, ఆన్లైన్ మోసాలు, గుడ్ టచ్ -బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు, లోన్ యాప్స్, పోక్సో చట్టాలపై అవగాహనా కల్పించారు. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇంస్టగ్రామ్ స్నేహాలు, మోసాలు గురించి విద్యార్థులకు వివరించారు. జిల్లాలో ఇటీవల జరిగిన పలు మోసాలను విద్యార్థులకు డీఎస్పీ వివరించారు.

విద్యతోనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, ప్రతిఒక్క విద్యార్థిని ఉన్నత చదువులు చదివి తలిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, అబ్దుల్ కలామ్ లాంటి మహోన్నతుల జీవితాలను ఆదర్శంగా తీసుకోవాలని డీఎస్పీ విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమంలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్ఐ వై సుధాకర్, పాఠశాల ప్రిన్సిపాల్ యలమర్తి రవీంద్రకుమార్, పంచాయతీ కార్యదర్శి తనూజ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.