The Desk…Bhimadole : డ్రైనేజీల ఆక్రమణలపై పంచాయతి అధికారుల చర్యలు

The Desk…Bhimadole : డ్రైనేజీల ఆక్రమణలపై పంచాయతి అధికారుల చర్యలు

  • గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు
  • ఆక్రమణ తొలగించి డ్రైనేజీని ఏర్పాటు చేస్తుండటంతో కాలనీవాసులు హర్షం

🔴 ఏలూరు జిల్లా : భీమడోలు మండలం : భీమడోలు : ది డెస్క్ :

వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వర్షపు నీరు నిలువ ఉండకుండా చూసేందుకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భీమడోలు పంచాయతీ పరిధిలో కొంతమంది పంచాయతీకి సంబంధించిన డ్రైనేజీని ఆక్రమించి ప్రహరీ గోడలు నిర్మించుకున్న నేపథ్యంలో పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు.

వర్షాలు ప్రారంభమయ్యాయని, వర్షపు నీరు- ఇళ్లలో వాడకం నీరు రోడ్లపై వస్తున్నాయని డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఆక్రముల తొలగించాలని పదేపదే ఆక్రమణదారులకు తెలిపినప్పటికీ వారు ఆక్రములు తొలగించలేదని దీంతో పంచాయతీ అధికారులే ఆక్రమణలు తొలగించే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు. ఇప్పటికే భీమడోలు పంచాయతీ గ్రామం అంతా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో గ్రామస్తులందరూ డ్రైనేజీ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి తనుజా మాట్లాడుతూ…

భీమడోలు పంచాయతీ పరిధిలో ప్రజలందరూ తమ ఇళ్లలో నీరు రోడ్లపైకి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని పంచాయతీ ఆస్తులను అందరం కలిసి కాపాడాలని ప్రజలందరికీ ఉపయోగపడే డ్రైనేజీ వ్యవస్థ పారిశుధ్య పరిరక్షణకు అందరూ సహాయ సహకారాలు అందించాలని గ్రామస్తులును పంచాయతీ కార్యదర్శి తనూజ కోరారు.