The Desk…Bharat 🇮🇳 : భారత్ మరో మైలురాయిని అధికమించే ప్రయత్నం…12 గంటల్లో పాతాళయాత్ర..!

The Desk…Bharat 🇮🇳 : భారత్ మరో మైలురాయిని అధికమించే ప్రయత్నం…12 గంటల్లో పాతాళయాత్ర..!

THE DESK : భారత్ సముద్రయాన్ కు చకచకా ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 12 గంటల వ్యవధిలో సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు వెళ్లి బయటకు వచ్చేందుకు వీలుగా ఓ ప్రత్యేకమైన డైవింగ్ మెషీన్ ను సిద్ధం చేసింది.

దీనికి మత్స్య-6000 అనే పేరు పెట్టింది.

ఈ ప్రాజెక్టు విజయ వంతమైతే సముద్రపు అట్టడుగు ప్రాంతాలను అన్వేషించగల సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, జపాన్, ఫ్రాన్స్, చైనాల క్లబ్ లోకి భారత్ కూడా అడుగు పెడుతుంది.

మత్స్య 6000 అనేది సముద్రయాన్ మిషన్ కింద అరుదైన ఖనిజాలను, లోతైన సముద్ర అన్వేషణ కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించిన భారతీయ సిబ్బందితో కూడిన డీప్-సబ్‌మెర్జెన్స్ వాహనం.

ప్రస్తుతం అభివృద్ధిలో, వాహనం 600 బార్ల ఒత్తిడిని తట్టుకోగల 2.1మీ వ్యాసంతో పాటు 80మిమీ మందంతో టైటానియం అల్లాయ్ స్పియర్‌ను కలిగి ఉంటుంది.