బాపట్ల జిల్లా : బాపట్ల : ది డెస్క్ :
రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను ముందుకు తీసుకెళ్లడంలో తహసిల్దార్ షలీమా సేవలు ప్రశంసనీయమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి అన్నారు.
బాపట్ల మండల పరిధిలో రెడ్ క్రాస్ మెంబర్ షిప్ ప్రత్యేక కార్యక్రమం ముందంజలో ఉంచడంలో కృషిచేసిన తహసిల్దార్ షలీమాను గురువారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి సత్కరించడంతోపాటు ప్రశంసా పత్రం అందజేశారు.
బాపట్ల సబ్ డివిజన్ పరిధిలో ఆర్డీవో గ్లోరియా నేతృత్వంలో తహసిల్దారులు విశేష కృషి చేసి బాపట్ల జిల్లాను సభ్యత్వ నమోదు విషయంలో ప్రథమ స్థానంలో నిలిపారని, వారందరి కృషి తోనే ఇటీవల రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో డిఆర్ఓ గంగాధర్ గౌడ్, ఆర్డిఓ గ్లోరియా, జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.