బాపట్ల జిల్లా : ది డెస్క్ :
జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. బాల్య, కౌమర కార్మిక వ్యవస్థ చట్టం 2016 ప్రకారం 18 సంవత్సరాల వయస్సు లోపల ఉన్న బాల బాలికలు ఎవరూ కూడా పని ప్రదేశాలలో ఉండకూడదన్నారు.
అలా ఎవరైనా పిల్లలను పనిలో పెట్టుకున్నట్లయితే వారిపై బాల కార్మిక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ జె.వెంకట మురళి హెచ్చరించారు. ఈ సందర్భంగా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించిన గోడ పత్రికను శనివారం ఆవిష్కరించారు.