- మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక చొరవతో ఒక కోటి 80 లక్షల నిధులను మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ
- హర్షం వ్యక్తం చేస్తున్న ఆత్మకూరు యువత..
🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
ఆత్మకూరులో సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో ఒక కోటి 80 లక్షల నిధులను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ మేరకు ఆదివారం నెల్లూరు క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు.
మాస్టర్ ప్లాన్, అంచనాలు, టెండర్లు ప్రక్రియ పై స్పోర్ట్స్ అథారిటీ అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని దిశా నిర్దేశం చేశారు.
ఆత్మకూరు నియోజకవర్గం కేంద్రంలో 12 సంవత్సరాల క్రితం ఆనం రామనారాయణరెడ్డి ప్రతిపాదించి ప్రారంభించిన స్పోర్ట్స్ స్టేడియం పనులు అతి త్వరలోనే పట్టాలెక్కలున్నాయి. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఆత్మకూరు స్టేడియం ఏర్పాటు త్వరలోనే సాకారం కానున్న నేపథ్యంలో ఆత్మకూరు యువత హర్షం వ్యక్తం చేస్తూ మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

