🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో DSC లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అమరావతి వేదికగా నియామక పత్రాలు అందించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి ఆనం పేర్కొన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం మెగా DSC నిర్వహించడం ద్వారా, ఎన్నో కష్టాలు అనుభవించి ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగ యువతకు ఇది నిజమైన పండుగ అని మంత్రి ఆనం తెలిపారు.
త్వరలో ఆత్మకూరు నుండి మెగా DSC లో ఎంపికైన అభ్యర్థులను పిలిపించి ఘనంగా సత్కరించనున్నట్లు మంత్రి ఆనం ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఎల్లప్పుడూ అండదండలుగా నిలుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.