- ఉదారత చాటుకున్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
🔴 నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :
సమాజంలో వెనుకబడిన, రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి బాధపడుతున్న ఓ పేద విద్యార్థికి అండగా నిలిచి, మానవత్వానికి ప్రతీకగా నిలిచారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.నేడు ఆత్మకూరులోని బీసీ గురుకుల పాఠశాల పర్యవేక్షణ సందర్భంగా, రోడ్డు ప్రమాదంలో తన కాలు కోల్పోయి ప్రస్తుతం స్థానిక పాలిటెక్నిక్ కళాశాలలో మొదట సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థి తన ఆవేదనను మంత్రి ఆనంకు వివరించాడు.
ఆ విద్యార్థి పరిస్థితి చూసి చలించిపోయిన మంత్రి ఆనం, తక్షణమే తన సొంత ఖర్చుతో ఆ విద్యార్థికి ఆర్టిఫిషియల్ కాలు ఏర్పాటు చేయిస్తానని, అలాగే అయ్యే అన్ని ఖర్చులను తానే భరిస్తాననీ భరోసా ఇచ్చారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాటలు విని ఆ విద్యార్థి ఆనందభాష్పాలు కార్చడం, అక్కడి వారందరికీ హృదయాన్ని హత్తుకుంది.
తదనంతరం, మంత్రి ఆనం వెంటనే స్థానిక ఆర్డీఓ పావని ను పిలిచి విద్యార్థి పూర్తి వివరాలు సేకరించాలనీ, ఆర్టిఫిషియల్ కాలుకు అయ్యే ఖర్చుతో పాటు, నెలవారీ మెస్ ఖర్చులను కూడా మంత్రి ఆనం స్వయంగా భరిస్తానని తెలిపారు.ఉదారత, సేవా భావం కలగలిపిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ నిర్ణయం విద్యార్థికి కొత్త ఆశలను నింపగా, సమాజంలో సానుభూతి, మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మంత్రి ఆనం వికలాంగుడైన విద్యార్థి విషయంలో చొరవ తీసుకోవడం గమనార్హం.