The Desk…Atmakur : 144.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం : మంత్రి ఆనం

The Desk…Atmakur : 144.5 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం : మంత్రి ఆనం

  • ఆత్మకూరు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల ద్వారా సుమారుగా 144 కోట్ల 50 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టాం: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
  • జీవన్ మిషన్ ద్వారా ఆత్మకూరు మండలం లో 19 కోట్లతో 76 పనులకు ప్రారంభించాం…కొన్ని టెండరు ప్రక్రియ సాగుతున్నది.. అదేవిధంగా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలో 336 పనులకు 65 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది : మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
  • రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల రూపాయల నిధులు కొరత ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వడ్డీలు చెల్లిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టింది : రాష్ట్ర దేవాదాయ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి .

నెల్లూరు జిల్లా : ఆత్మకూరు : ది డెస్క్ :

ఆదివారం ఆత్మకూరు మండలం వాసిలి గ్రామంలో జాతీయ రహదారి నుంచి వాసిలి గ్రామం వరకు సుమారు 49 లక్షల రూపాయలతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మించ తలపెట్టిన సిసి రోడ్లకు శంకుస్థాపన మరియు పూర్తయిన రోడ్లకు ప్రారంభోత్సవం చేశారు….

అనంతరం మంత్రి ఆనం మాట్లాడుతూ:

నియోజకవర్గ పరిధిలో సుమారుగా ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మరమ్మతులు చేయడం జరుగుతుందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ద్వారా చివరి ఆయకట్టు భూములుకూడా వ్యవసాయ ఆమోదయోగ్యం పొందడం హర్షనీయమన్నారు. రాష్ట్రంలో అనేక లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు వ్యవసాయంలో అంతర్భాగమన్నారు. మరికొన్ని నూతన పథకాలను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు.

NDA చేసిన వాగ్దానాల మేరకు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందజేస్తున్నదన్నారు. ఈనెల 31 తారీఖున పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇంటింటికి మూడు గ్యాస్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని అదనంగా నూతన గ్యాస్ కనెక్షన్ 200 ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపారు.


నియోజకవర్గ పరిధిలో 761 పనులకు 50కోట్ల 72 లక్షల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు నియోజకవర్గ ప్రజల శ్రీకారం చుట్టి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. 9 బి .టీ రోడ్లు 47 కిలోమీటర్ల మేర ఏర్పాటుకు చేయుటకు 26 కోట్ల 90 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. వాసిలి ఎస్సీ కాలనీలో 69 లక్షల 30 వేల రూపాయలతో త్రాగునీటి పథకాన్ని ఏర్పాటు చేయడం జరుగుతున్నదన్నారు.


మండల పరిధిలో జలజీవన్ మిషన్ కింద 76 పనులకు 19 కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందని నియోజకవర్గ పరిధిలో 336 పనులకు 6588. లక్షల రూపాయలతో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి పావని, మండల రెవెన్యూ అధికారి మండల అభివృద్ధి అధికారి పంచాయతీరాజ్ శాఖ అధికారులు స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.