కాకినాడజిల్లా : అన్నవరం పోలీస్స్టేషన్ : ప్రత్తిపాడుసర్కిల్, : ది డెస్క్ :

కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ జిల్లాలో గంజాయిని మరియు. జిల్లామీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి అక్రమరవాణాను పూర్తిగా నిర్ములించుటకు తీస్కుంటున్న చర్యలలో భాగంగా, నేషనల్ హైవే మీద, నేషనల్ హైవేచేరుకునే మార్గాలపై ప్రత్యేక నిఘా పెట్టి, గంజాయి అక్రమరవాణాను పూర్తిగా అరికట్టాలని ఇచ్చిన ఆదేశాల మేరకు, కాకినాడ జిల్లా శంఖవరం మండలం పరిధిలో ది09.06.2025 తేదిననెల్లిపూడి గ్రామ శివారులోని శంఖవరం-కత్తిపూడి రహదారి లోనిపుంతరోడ్డు వద్ద గంజాయి అక్రమరవాణా చేస్తున్న నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని, వారి వద్ద 131.1 కేజీల గంజాయి (విలువ సుమారు RS 6,65,500/-),3 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, రూ.16,500/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది.
వివరాలులోకి వెళ్ళితే.. ఈరోజు అనగా 09.06.2025న ఉదయం 11.00 గంటలకుA.S.R జిల్లా, G. మాడుగుల మండలం, కి చెందినA-1పాంగి కృష్ణారావు, S/o బొంజుబాబు, A/41 yrs C/ST-కొండ కమ్మరి, మగలూరు గ్రామం, A-2 జగ్గందొర గోపాల్, S/o బాలన్న A/24yrs, C/కొండ కమ్మరి, బండవీధి, గడ్డరాయి గ్రామం, కుమ్మిడిసింగ్ పంచాయతీ, A-3 గొల్లోరి మత్యరాజు @ గౌతమ్, S/o ధర్మరాజు A/21yrs, C/ST-మలి, బూరుగు వీధి, సింగర్బ పంచాయతీ అను వారు గంజాయిని ఒడిస్సా రాష్ట్రము, మల్కనగిరి పరిసర ఆటవి ప్రాంతం నుండి AP39EJ1144 నెంబర్ గల హ్యుండై వెన్యు కారు, AP31CP5799 నెంబర్ గల టాటా ఇండికా EV2 కారుల లో 133.1 కేజీల గంజాయిని 6మూటలలో నెల్లిపూడి గ్రామ శివారుకి తీసుకువచ్చి, A-4కోమలి రామకృష్ణ @ బాబి, S/o రామకృష్ణ, A/30yrs, C/Kapu Y-జంక్షన్, సుబ్బారావుపేట, రాజమండ్రి టౌన్ అను వ్యక్తి AP40BF8786 నెంబర్ గల టయోట గ్లాంజ కారు లో రాగా, గంజాయిని అతనికి అప్పగిస్తున్నసమయంలో, పోలీసులు దాడి చేసి సదరునలుగురు ముద్దాయిలను అరెస్ట్చేసి,వారి వద్ద నుండి 133.1 కేజీల గంజాయి (విలువ సుమారు RS 6,65,500/-), 3 కార్లు, 4 మొబైల్ ఫోన్లు, రూ.16,500/- నగదు స్వాధీనంచేసుకొని అన్నవరం పోలీస్ స్టేషన్ లో Cr No 126/2025 U/S8(c) r/w 20(b) (ii) (C) NDPSగా కేసు నమోదు చేయడమైనది.
A4 ముద్దాయి అయిన కోమలి రామకృష్ణ @ బాబి సదరు గంజాయిని A-1 ముద్దాయి అయిన పాంగి కృష్ణారావు వద్ద నుండి గంజాయి కొని, హైదరాబాదు మరియు మహారాష్ట్ర కు తీసుకువెళ్ళి గంజాయిని ఎక్కువ రేటుకు అమ్ముతుంటాడు. A-1 పాంగి కృష్ణారావు, A-3 గొల్లోరి మత్యరాజు @ గౌతమ్ మరియుA-4 కోమలి రామకృష్ణ @ బాబి అనువారిపై పలు గంజాయి కేసులు ఉన్నాయి.
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పర్యవేక్షణ లో పెద్దాపురం ఎస్డిపిఓ డి. హరి రాజు ఆధ్వర్యంలో ముద్దాయి లను అరెస్ట్ చేసిన ప్రత్తిపాడు సి.ఐ. బి సూర్య అప్పారావు , దర్యాప్తులో పాల్గొన్న అన్నవరం యస్.ఐ. జి శ్రీహరిబాబు, అన్నవరం అదనపు యస్.ఐ.L ప్రసాద్ మరియు అన్నవరం పోలీస్ సిబ్బందికి కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ అభినందనలు తెలియజేసినారు.