The Desk …Anantavaram : డాక్టర్ మనోజ్, వైష్ణవిలచే అమరావతి రైతులకు ఘన సన్మాన కార్యక్రమం – ఈనెల 5న

The Desk …Anantavaram : డాక్టర్ మనోజ్, వైష్ణవిలచే అమరావతి రైతులకు ఘన సన్మాన కార్యక్రమం – ఈనెల 5న

🔴 అమరావతి : అనంతవరం : ది డెస్క్ :

వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి తనకున్న మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరాన్ని అమ్మి 25 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విరాళంగా ఇచ్చారు. ఈ త్యాగానికి ప్రేరణ అయిన ఆమె తండ్రి డాక్టర్ అంబుల మనోజ్‌ స్ఫూర్తితో ప్రజల్లో అమరావతి అభివృద్ధి అవగాహన కల్పిస్తూ.. వైష్ణవి అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌గా ముఖ్యమంత్రి చేత నియమితులయ్యారు.

అమరావతికి భూములు దానం చేసిన రైతులకు ఫిబ్రవరి 5, 2026 గురువారం సాయంత్రం 3.30 గంటలకు అనంతవరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘన సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అమరావతి రైతుల త్యాగానికి ప్రతిఫలంగా వారిని సన్మానించి, వారి పాదాలు కడిగి పాదపూజ చేయాలని నిర్ణయించిన డాక్టర్ మనోజ్ నిర్ణయించుకున్నారు.

ఈ కార్యక్రమానికి అమరావతి రైతులoదరూ ఆకుపచ్చ కండవాలు ధరించి హాజరుకావాలని కోరుతున్నారు.

Dr. Manoj, Vaishnavi to Honor Amaravati Farmers on Feb – 5

In a heartfelt tribute, Dr. Ambula Manoj and his daughter Vaishnavi—who sold an acre of family land for ₹25 lakh to donate to CM N. Chandrababu Naidu’s Amaravati vision—will honor land-donating farmers. Vaishnavi, appointed Amaravati Brand Ambassador by the CM, inspired by her father’s zeal, will lead the grand felicitation at Anantavaram Sri Venkateswara Swamy Temple on Thursday, Feb 5, at 3:30 PM. Farmers are urged to attend wearing green scarves; Dr. Manoj plans to wash their feet in reverence.