The Desk…Amaravati : GST తగ్గింపు, పన్ను ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి : మంత్రి నాదెండ్ల

The Desk…Amaravati : GST తగ్గింపు, పన్ను ప్రయోజనాలు వినియోగదారులకు చేరాలి : మంత్రి నాదెండ్ల

🔴 అమరావతి : సచివాలయం : ది డెస్క్ :

సచివాలయం రెండో బ్లాక్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఛాంబర్ లో లీగల్ మెట్రాలజీ అధికారులతో ఫోన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. జీఎస్టీ సంస్కరణలు 2025 దృష్ట్యా లీగల్ మెట్రాలజీ శాఖ విడుదల చేసిన ఎంఆర్పీ సవరణలపై ప్రెస్ నోట్ 

భారతదేశంలో ఇటివల జరిగిన జీఎస్టీ సంస్కరణలను ఉద్దేశించి లీగల్ మెట్రాలజీ ధృకోణం నుండి ఎంఆర్పీ సవరణలకు సంబంధించి తుది వినియోగదారుని ప్రయోజనార్థం లీగల్ మెట్రాలజీ ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్‌లో జరిగిన సడలింపులు

భారత ప్రభుత్వం “జీఎస్టీ 2.0” కింద 22 సెప్టెంబర్ 2025 నుండి అమలులోకి వచ్చిన ప్రధాన సంస్కరణలను లీగల్ మెట్రాలజీ శాఖ నుంచి అధికారులు తీసుకోనవలసిన చర్యలను గురించి వివరించారు.

సరళతరం చేయబడిన పన్నులు మరియు కొన్ని అవసరమైన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించబడినందున వినియోగదారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈ తగ్గింపుల లాభం తుది వినియోగదారులకు చేరేలా చూడాలని సూచించారు.

లీగల్ మెట్రాలజీ శాఖ, లీగల్ మెట్రాలజీ చట్టం, 2009 మరియు లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్ 2011 అమలును పర్యవేక్షిస్తుంది. ఈ నియమాల ప్రకారం ప్రతీ ప్యాకేజీపై తప్పనిసరిగా వివరాలు ఉండాలి (ఎంఆర్పీ సహా), నికర పరిమాణం మొదలైనవి.

రూల్ 6 ప్రకారం ప్రతీ ప్యాకేజీపై తప్పనిసరిగా ఉండాల్సిన వివరాలు:

1. తయారీదారు పేరు మరియు చిరునామా

2. సాధారణ లేదా ఉత్పత్తి పేరు

3. నికర పరిమాణం

4. తయారీ / ప్యాకింగ్ / దిగుమతి చేసిన నెల, సంవత్సరం

5. గరిష్ట చిల్లర ధర (అన్ని పన్నులు కలిపి)

6. వినియోగదారుల ఫిర్యాదు వివరాలుజీఎస్టీ రేట్ల మార్పులు, ముఖ్యంగా తగ్గింపులు, ఎంఆర్పీ సవరణలకు దోహదపడ్డాయి. దీనివల్ల వినియోగదారులు తగ్గిన ధర చెల్లించే అవకాశం ఉంటుంది.

వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి మరియు పరిశ్రమపై అనవసరమైన భారాన్ని తగ్గించడానికి వినియోగదారుల వ్యవహారాల శాఖ 18.09.2025 న ఒక సలహా జారీ చేసింది. దీని కోసం ప్యాకేజి కమోడిటీస్   రూల్ 33ని వినియోగించి, రూల్ 18(3)లోని కొన్ని నిబంధనలకు సడలింపులు ఇచ్చారు.

ప్రధాన సడలింపులు: ధర స్టిక్కరింగ్ : 22-09-2025కు ముందు తయారు చేసిన ప్యాకేజీలపై కొత్త ఎంఆర్పీ స్టిక్కర్లు అతికించడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందం మాత్రమే. కానీ పాత ఎంఆర్పీని తొలగించరాదు.

పత్రిక ప్రకటనలు : పత్రికలలో ప్రకటన ఇవ్వాల్సిన అవసరం లేదు.

ధర సర్క్యులర్లు : తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులు కొత్త ధరల సర్క్యులర్లు ను డీలర్లకు పంపాలి. ప్రతులను డైరెక్టర్ (లీగల్ మెట్రాలజీ) మరియు రాష్ట్ర కంట్రోలర్లకు పంపించాలి.

పాత ప్యాకేజింగ్ వినియోగం : పాత ప్యాకేజింగ్ సామాగ్రి 31-03-2026 వరకు లేదా స్టాక్ పూర్తయ్యే వరకు వాడుకోవచ్చు. ఎంఆర్పీ సవరణలు ముద్రించడం/స్టిక్కర్లు అతికించాలి.

యూనిట్ ధర ప్రకటన : పాత ప్యాకేజీలపై యూనిట్ ధర ప్రకటించడం తప్పనిసరి కాదు. స్వచ్ఛందం మాత్రమే.

సమాచారం ప్రచారం: తయారీదారులు/ప్యాకర్లు/దిగుమతిదారులు ధర తగ్గింపుల గురించి డీలర్లు, రిటైలర్లు, వినియోగదారులకు ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలి.

వినియోగదారుల లాభం: ఈ సడలింపుల వల్ల జీఎస్టీ రేట్ల తగ్గింపుల లాభం నేరుగా వినియోగదారులకు చేరుతుంది. పరిశ్రమపై వ్యయం తగ్గుతుంది మరియు పాత ప్యాకేజింగ్ వృథా కాదు.

ఈ సమాచారం తయారీదారులు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ డీలర్లు, ఈ-కామర్స్, వినియోగదారులు మొదలైన వారందరికీ తెలియజేయబడుతుంది. ఎంఆర్పీ అధికంగా వసూలు చేసినట్లు ఫిర్యాదు చేయాలనుకుంటే టోల్ ఫ్రీ నంబర్ 1967 సంప్రదించండి.