The Desk … Amaravati: పత్రికా కార్యాలయంపై దాడి – దుర్మార్గం➖సానా సతీష్ బాబు

The Desk … Amaravati: పత్రికా కార్యాలయంపై దాడి – దుర్మార్గం➖సానా సతీష్ బాబు

🔴 అమరావతి : ది డెస్క్ :

హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీ మూకలు చేసిన దాడి దుర్మార్గమని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు తీవ్రంగా ఖండించారు.

ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే స్వయంగా రౌడీ మూకలను వెంటేసుకుని మీడియా కార్యాలయంపై దాడి చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి అంశంపై ఆధారాలతో ప్రశ్నిస్తున్న మీడియాపై దాడులకు దిగడం వైసీపీ పిరికిపంద చర్యకు నిదర్శనమని విమర్శించారు.

ప్రజాస్వామ్యంలో గూండాగిరీకి తావులేదని, పత్రికా స్వేచ్ఛను హరించే ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు.